స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తు న్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఫిక్షనల్ క్యారెక్టర్‌తో కథ…
1948లో జరిగే కథ ఇది. యాక్షన్, డ్రామా, వార్… అన్ని చాలా గ్రాండ్‌గా ఉంటాయి. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలా మందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ని సృష్టించి ఈ కథని చూపించడం జరిగింది. సినిమాలో నా క్యారెక్టర్ పూర్తిగా హైదరాబాదీ. ఆ యాస స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది.
అద్భుతమైన యాక్షన్…
ఈ సినిమా కోసం పీటర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్‌లో నాకు కొన్ని గా యాలు కూడా అయ్యాయి. ఇండియాకి స్వా తంత్య్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్‌కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. డైరెక్టర్, స్వప్న, ఆర్ డైరెక్టర్ తోట ప్రతిదీ రీసె ర్చ్ చేశారు. ఆ కాలంలో ఎలా ఉండేవారు అనేదాన్ని డైరెక్టర్ ప్రతీది శ్రద్ధ తీసుకుని చేశారు.
ప్రతి పాత్రకి ప్రాధాన్యత…
కోవై సరళ నాన్నగారితో కూడా చాలా సినిమాలు చేశారు. చాలా అద్భుతమైన టైమింగ్ వున్న నటి. ఇందులో కళ్యాణ్ చక్రవర్తిది బైరాన్ పల్లి గ్రామంలో ఒక నిజమైన పాత్ర స్ఫూర్తితో రాసుకున్న క్యారెక్టర్. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. సినిమాలో బైరాన్ పల్లి గ్రామంలోని ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ప్రారంభం, ముగింపు ఉంటుంది.
బలమైన సబ్జెక్టుతో…
-హాలీవుడ్‌లో ‘స్పైడర్ మ్యాన్’ లాంటి సినిమాలు దాదాపు 3000 కోట్లు పెట్టి తీస్తారు కానీ అం దులో ఒక కొత్త నటుడు ఉంటాడు. ఖర్చు పెట్టే ది సినిమా మీద. ఇక ఈ సినిమాలో బలమైన సబ్జెక్టు ఉంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టారు.
చాలా మంచి వినోదం…
ఇందులో హీరో, హీరోయిన్‌ల మధ్య డ్రామా అనే కాన్సెప్ట్‌తో చాలా మంచి వినోదం ఉంటుంది. అనస్వర మలయాళంలో దాదాపు 25 సినిమాలు చేసింది. సినిమాలో తన పాత్రలో చాలా బలమైనది. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్తగా…
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో కొత్త మిక్కీ జే మేయర్‌ని చూస్తారు. యాక్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంటుంది.