హైదరాబాద్: మాస్ మహరాజ రవితేజ చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నినెల క్రితం ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి సినిమాగా ఇది రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. ‘వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా’ అంటూ రవితేజా తనదైన శైలీలో కామెడీని పండించారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13, 2026న విడుదల కానుంది.