సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీరామ ఎంటర్ ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో అలముకోవడంతో మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.స్థనికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.