అమరావతి: మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వలేదని ఓ వ్యక్తిని బాలుడు చంపాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కొత్తపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాతాజీ(48) అనే వ్యక్తిని మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వాలని ఓ బాలుడు (17) అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని తాతాజీని బాలుడు పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.