న్యూయార్క్: అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. షార్లెట్‌కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో సి550 జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశామని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు కొద్దిపాటి వర్షం కురిసినట్టు సమాచారం. మృతులలో మాజీ ఎన్ఎఎస్ సిఎఆర్ స్టార్ గ్రెగ్ బిఫిల్ కూడా ఉన్నారు. విమానం మొదట టేకాఫ్ అయిన తర్వాత వెనక్కి తిప్పడంతో అది కూలిపోయిందని నార్త్ కరోలినా హైవే పెట్రోల్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతో విమానం టేకాఫ్ కాగానే ల్యాండింగ్ చేశారని తెలిసింది.