బెంగళూరు: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడిని కుమారుడు హత్య చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయపుర ప్రాంతంలో జరిగింది. సింధగి తాలూకాలోని ఓ గ్రామంలో సిద్ధనగౌడ, మల్లమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు అప్పుగౌడ అనే కుమారుడు ఉన్నాడు. మల్లమ్మతో భూస్వామి మహదేవప్ప చనువు ఉండేవాడు. దీంతో మహదేవప్పను హత్య చేయాలని అప్పుగౌడ నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రితో కలిసి మహదేవప్పను హత్య చేసి గ్రామ శివారులో పొలంలోని కంపలో పడేశారు. హత్య చేసిన అనంతరం ఒకే మాట మీద ఉండడంతో విచారణలో జవాబులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హత్య చేసే సమయంలో ఎక్కడా కూడా మొబైల్ ఫోన్లను ఉపయోగించలేదు. పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు. గ్రామస్థుల సమాచారం మేరకు మల్లమ్మ, సిద్ధనగౌడ, అప్పుగౌడను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా ఒకే రకమైన సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ జాప్యమైంది. న్యాయస్థానం అనుమతి తీసుకొని వారి బ్రెయిన్ మ్యాపింగ్ పాలిగ్రఫి పరీక్షలు నిర్వహించారు. వీరి నేరం బయటపడడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.