డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాకినాడకు చెందిన సూరంపూడి చంద్రశేఖర్, వెంకట్ నవీన్ అని తెలుస్తోంది. వీరిద్దరు విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.59 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. వృద్ధుడికి వాట్సాప్ కాల్ చేసి పోలీసులమని కేటుగాళ్లు చెప్పారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి.. నిందితులు డబ్బులు కాజేశారు. ఇప్పటివరకూ నిందితులు రూ.8 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఆ డబ్బును షెల్ కంపెనీ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా 65 సైబర్ కేసుల్లో ఈ నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 15 కరెంట్ అకౌంట్లు సరఫరా చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, 10 డెబిట్ కార్డులు, చెక్‌బుక్స్, పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉణ్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.