వరంగల్: గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒక విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితకబాదారు. 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహుటిన వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీపక్ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఘర్షణ సమయంలో వార్డెన్, అధ్యాపకులు అందుబాటులో లేరు. విద్యార్థులు గొడవపడుతుంటే ఆధ్యాపకులు, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.