నిర్మల్ జిల్లా, కడెం మండలం, లింగాపూర్ నూతన సర్పంచ్ రంజిత్ కుమార్ గ్రామంలో కోతుల బాధ నుండి ప్రజలను తప్పించడానికి చింపాంజీ వేషం వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు తమకు కోతుల బాధ నుండి తప్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్ వినూత్నంగా కోతులను తరమడానికి శుక్రవారం తానే స్వయంగా చింపాంజీ వేషం వేసి గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ కోతులను పరుగెత్తేలా చేశారు. ఏదేమైనా గ్రామ సర్పంచ్ స్వయంగా చింపాంజీ వేషం వేసి కోతుల బాధ నుండి ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నించడాన్ని పలువురు అభినందిస్తున్నారు.