అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పులివెందులలో మైనర్ బాలిక ప్రసవించింది. వేంపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో మైనర్ బాలిక 8వ తరగతి చదువుతుంది. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. గురువారం మైనర్ బాలికకు పురిటి నొప్పులు రావడంతో వేంపల్లిలోని ఇంటి వద్ద ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిస్థితి విషమించడంతో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.