భద్రాద్రి కొత్తగూడెం: సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయలేదని రైతుపై ఓడిపోయిన అభ్యర్థి, నాయకులు దాష్టికానికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. గంగారం తండాలో తమ అభ్యర్థికి ఓటు వేయలేదన్న కక్షతో ఓ రైతుకు చెందిన 60 బస్తాల వడ్లను ఓడిపోయిన అభ్యర్థి, అనుచరులు తడిపినట్టు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థికి మద్దతు ఇచ్చారనే కోపంతో వడ్లను తడిపారు. దీంతో బాధితులు రోడ్డెక్కారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తాం కానీ బలవంతంగా ఎలా వేస్తారని రైతులు వాపోతున్నారు.