పేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు
మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం
బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామనే బ్యాంకర్స్…
ఈనెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి
ఇదే విషయాన్ని హరీశ్ రావు గారి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం
క్షణం ఆలస్యం చేయకుండా సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూ కేషన్ లోన్ మంజూరు చేయించిన హరీశ్ రావు గారు.
హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు ఇచ్చిన హరీష్ రావు
నాడు ఆటో కార్మికుల కోసం… నేడు నిరుపేద విద్యార్థిని చదువు కోసం హరీష్ రావు గారి ఆపన్నహస్తం
మరో గొప్ప మానవతా… ఔదార్యాన్ని చాటి చెప్పిన హరీష్ రావు…
సిద్దిపేట: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గారు మరోసారి తన మానవతా ఔదార్యాన్ని చాటిచెప్పారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే హరీశ్ రావు గారు తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. ఆ విద్యార్థినికి బ్యాంకు రుణం దక్కడానికి ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టి పెద్దమనసు చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటా లోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ. 7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు ఉంది. ఆర్థిక స్తోమత లేని రామచంద్రం అంత డబ్బు చెల్లించలేక మనోవేదనకు గురయ్యాడు.
బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నించగా ఏవైనా ఆస్తులు మార్టిగేజ్ చేస్తేనే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పడంతో ఆ దారి కూడా మూసుకపోయింది. దీంతో గతంలో తన కూతుళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి.. మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని చేరవేశారు. విషయం తెలవగానే వెంటనే హరీష్ రావు గారు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు.
– అప్పు చేయొద్దు… హాస్టల్ ఫీజు కూడా ఇచ్చిన హరీష్ రావు..
మొదటి సంవత్సరం హాస్టల్ కు లక్ష రూపాయలు అవుతుందని హరీష్ రావు గారి దృష్టికి రాగ మళ్ళీ హాస్టల్ ఫిజు కు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా నేనే చెల్లెస్తా అని హరీష్ రావు గారు ఇచ్చారు…
నాడు ఆటో కార్మికులకు అండగా..
నేడు పేద విద్యార్థిని చదువుకు చేయూతగా..
సిద్దిపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం మూడేళ్ల క్రితం తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించారు. ఆ ఫలితంగానే సిద్దిపేట ఆటో క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడమే గాకుండా వందలాది మంది ఆటో కార్మికులకు కొండంత భరోసాగా నిలిచింది. నేడు రుణం పొందిన ఆటో కార్మికులు ప్రతీ నెల పొదుపు చేస్తూ రుణం డబ్బులను వాయిదాలు లేకుండా చెల్లిస్తున్నారు. ఆపత్కాలంలో తమకు సొసైటీ ఉందని గట్టి ధీమాను హరీష్ రావు గారు వారికి కల్పించారు. ఆయన చేసిన సహాయం వందలాదిమంది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దోహద పడింది. నేడు నిరుపేద విద్యార్థిని మమత కు వైద్యవిద్యకు సంబంధించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కినా కనీసం ట్యూషన్ ఫీజు లేక.. ఆ సీటు నే కోల్పోయే పరిస్థితి తలెత్తింది. విషయం తన దృష్టికి రావడంతో ఆ అమ్మాయికి బ్యాంకు రుణం అందడానికి తన స్వగృహాన్ని మరోసారి మార్టిగేజ్ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగేలా యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ.. సబ్ రిజిస్టర్ ద్వారా ఇంటి పత్రాలను మార్టిగేజ్ చేసి సరైన సమయానికి మమత కు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడంలోనూ చొరవ చూపారు.