రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా డేవిడ్ రెడ్డి. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి‘ సిని మా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారి యా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ భరత్ మోటుకూరి మాట్లాడుతూ – “డేవిడ్ రెడ్డి సినిమాను కేవలం మనోజ్ మాత్రమే చేయగలరు. అనేక ఇబ్బందులు పెట్టిన తర్వాత ఒకరి నుంచి పుట్టుకొచ్చే ఆవేశమే ఈ సినిమా. ఆ ఆవేశమే బ్రిటీష్ వారి మీద తిరగబడేలా చేసింది. ఈ మూవీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ హనుమరెడ్డి యక్కంటి మాట్లాడుతూ “డేవిడ్ రెడ్డి సినిమా సబ్జెక్ట్ చాలా పెద్దది.
ఈ సినిమా కథ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామని మనోజ్ చెప్పారు. ‘డేవిడ్ రెడ్డి‘ నిజమైన పాన్ ఇండియా సినిమా. యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని ఫిక్షనల్ క్యారెక్టర్‌తో రాసిన స్క్రిప్ట్ ఇది. గ్లింప్స్‌లో చూసింది కొంతే. మిగతాది సినిమాలో చూడండి”అని తెలియజేశారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ “1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. డేవిడ్ రెడ్డి బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్‌కు కూడా శత్రువే. డేవిడ్ రెడ్డికి ప్రశాంతంగా ఉండటం రాదు, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఇలాంటి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సుప్రీమ్ సుందర్ పాల్గొన్నారు.