రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘రాజా సాబ్‘ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసా ద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ‘రాజా సాబ్‘ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ’సహన సహన..’ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని ఓ మాల్ లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల సందడి మధ్య గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ “ఇప్పుడు బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ సహన సహన మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా రెండు సాంగ్స్ కూడా అదిరిపోతాయి”అని పేర్కొన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ఈ సంక్రాంతి రాజా సాబ్‌తో రెబల్ సంక్రాంతి అవుతుంది అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్‌లోని పబ్లిక్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్ పాల్గొన్నారు.