మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగా ణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరగనుం ది. జస్టిస్ దీపాంకర దత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసును విచారించనుంది. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్‌పై జవాబు చెప్పాలని కోర్టు ఆదేశించిం ది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డి సెంబర్ 18వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు పంపింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటా రా? మేము తీసుకోవాలా ? అంటూ ప్ర శ్నించింది. తెలంగాణ ఎంఎల్‌ఎల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుదిక్కార పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ ను కెటిఆర్ దాఖలు
చేశారు. రోజు వారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని గవాయి సూచించారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు స్పీక ర్ తరపున న్యాయవా దులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎంఎల్‌ఎలు ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎంఎల్‌ఎలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్‌లో సమ ర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. 8 మందికి సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాగా, ఐదుగురు ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పు ప్రకటించారు. ఎంఎల్‌ఎలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్‌లను కొట్టివేశారు. ఎంఎల్‌ఎలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరిం చారు.