హనుమకొండ: ప్రియుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని మనస్థాపంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనూష హైదరాబాద్‌లో ఐటి కంపెనీలో జాబ్ చేస్తోంది. వరంగల్ జిల్లాలో కాశీబుగ్గకు చెందిన గుర్రపు పవన్‌ను గాఢంగా ప్రేమించింది. ఈ విషయం కూడా తల్లి రమాదేవికి కూతురు అనూష తెలిపింది. పవన్‌పై హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ప్రియుడిపై కేసు నమోదు కావడంతో ప్రియురాలు మానసికంగా కుంగిపోయింది. తన ప్రియుడిపై కేసు నమోదైందని పలుమర్లు తల్లి వద్ద కూడా కూతురు వాపోయింది. మనస్థాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.