మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పం చాయతీ ఎన్నికల పోరు బుధవారం జరిగిన మూడో విడతతో ముగిసింది. మొదటి 1,2వ వి డతల మాదిరిగానే మూడో విడతలోనూ అధికా ర కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించిం ది. మూడో విడతలో జరిగిన తుది సమరంలో 3,752 గ్రామ సర్పంచ్‌లకు, 28,410 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించగా.. వీటిలో కాంగ్రెస్ పార్టీ 2237 స్థానాలను, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ 1,153 స్థానాలను, బిజెపి 242 స్థానాల ను, ఇతరులు 490 స్థానాలను కైవసం చేసుకున్నారు. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ 6813, బిఆర్‌ఎస్ 3,509, బిజెపి 699, ఇతరులకు 1653 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఎన్నికలను మూడు దశల్లో ని ర్వహించగా, ఈ నెల11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడవ విడ త నిర్వహించిన ఎన్నికల తో పంచాయతీ ఎన్నికల ప ర్వం ముగిసింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం 80.78 శాతంగా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించాక ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కూడా రాత్రి పది గంటలకు దాదాపుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,726 గ్రామ పంచాయతీల్లో అదే సంఖ్యలో సర్పంచ్‌లకు, 1,12,242 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు.
మొదటి దశలో 4,236 సర్పంచ్‌లకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో 395 మంది సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా 9,644 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండవ దశలో 4,333 సర్పంచ్‌లకు, 38,350 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 495 మంది సర్పంచ్‌లు, 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో దశలో 4,158 సర్పంచ్‌లకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో ఇప్పటికే 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 36,456 వార్డులకు గాను ఎన్నికల్లో ఇప్పటికే 7908 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు విడతలను కలుపుకుని 12,726 సర్పంచ్‌లలో కాంగ్రెస్ పార్టీ నుంచి 6813 మంది ఎన్నిక కాగా బిఆర్‌ఎస్ నుంచి 3,509 మంది, బిజెపి నుంచి 699, ఇతరులు 1653 మంది గెలుపొందారు. కాగా, మొదటి దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,331 మంది, బిఆర్‌ఎస్ నుంచి 1,168 మంది, బిజెపి నుంచి 189 మంది, ఇతరులు 539 మంది గెలుపొందారు. రెండో దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,245 మంది , బిఆర్‌ఎస్ నుంచి 1,188 మంది, బిజెపి నుంచి 268 మంది, ఇతరులు 624 మంది ఎన్నికయ్యారు. మూడో దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2,237, బిఆర్‌ఎస్ నుంచి 1153 మంది, బిజెపి నుంచి 242 మంది, ఇతరులు 490 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.