కాంగ్రెస్ నాయకురాలు, కేరళ వయినాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వద్ర గురువారం నాడు పార్లమెంటు ప్రాంగణంలోని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేరళ గుండా వెళ్తున్న ఆరు రోడ్డు ప్రాజెక్టుల ప్రగతిని చర్చించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ఆత్మీయంగా అందించిన అల్పాహారాన్ని ప్రియాంక గాంధీ రుచి చూశారు.చర్చల సందర్భంగా కొన్ని ప్రాజెక్టులు కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయని, కాబట్టి కేంద్రం వాటిని నిర్వహించలేమని రహదారుల శాఖమంత్రి అన్నారు. అయినా కేరళ ప్రభుత్వంతో చర్చించి, వాటిని తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇటీవల తన నియోజకవర్గం రాయ్ బరేలి లోని కొన్ని రోడ్ల గురించి తనను కలిసిన విషయాన్ని గుర్తుచేస్తూ, తమ్ముడి మాట ఆలకించి, మీ మాట వినకపోతే, మీరు ఫిర్యాదు చేస్తారు కదా అని గడ్కరి అనడంతో గదిలో నవ్వులు వెల్లివిరిశాయి.