కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గాను గురువారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గా ఎదుట విలేకర్లతో మాట్లాడుతూ ఎంతో ప్రాచూర్యం కల్గి అటవీ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా వెలిసిన నాగుల్ మీరా దర్గాను దర్శించుకోవడం సంతోషకరమన్నారు. ఇక్కడ రాములవారి ఆలయం హిందూ, ముస్లీంలకు ఐక్యతకు నిర్వచనమన్నారు. తెలంగాణ ఉద్యమానికి అనాడు ఈ దర్గానే పురుడుపోసినప్పటికి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. కనీస సౌకర్యాలను దర్గాకు కల్పించి పాలకులు శాశ్వత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో మొదటిరోజు ఇల్లందు దర్గా నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ప్రజల స్ధానిక సమస్యలను తెలుసుకోని వాటిని ప్రభుత్వం దృషికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా జాగృతి జనంబాట ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడుస్తన్నప్పటికి పల్లెల్లో అభివృద్ధి అంతంత మాత్రమే వుందని, గ్రామపంచాయితీ ఎన్నికల తదనంతరమైన గ్రామాలపై ప్రభుత్వం దృషి సారించాలన్నారు. గుర్తులు లేని ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రేస్ మేమంటే మేము గెలిచామని గొప్పలకు పోతున్నాయన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హమీ ప్రజలకు పూర్తిగా అందలేదని, వృద్ధ్యాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్స్‌ను పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడుతుందన్నారు.