ముంబైలో కుంద్రాలో నటి శిల్పా శెట్టి ఇంటిపై ఆదాయపు అధికారులు గురువారంనాడు సోదాలు నిర్వహించారు. ఆమె నిర్వహిస్తున్న బాస్టియన్ రెస్టారెంట్ కు సంబంధించిన కేసులో ఈ దాడి జరిగింది. 2014లో స్థాపించిన ఈ రెస్టరెంట్ లో ఆమె సహ యజమాని. ఈ కేసుకు సంబంధించి బెంగళూరు లోని కొన్ని ప్రదేశాలలోకూడా ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరులోని రెస్టారెంట్ బాస్టియన్ గార్డెన్ సిటీ అవుట్ లెట్ చట్టబద్దమైన సమయాన్ని మించి పని చేస్తున్నందు వల్ల దానిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత ఆదాయ పన్ను ఈ చర్య తీసుకున్నారు.మరో పక్క ఒక వ్యాపారవేత్తను పెట్టుబడికి సంబంధించిన ఒప్పందంలో రూ.60 కోట్లకు మోసం చేసుకునే ఆరోపణలపై శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరో కేసు ఎదుర్కొంటున్నారు. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈ జంటపై మోసం అభియోగం మోపింది.