మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రా వు, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించినట్లు సరైన ఆధారాలు లేవని అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశా రు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తీర్పు వె లువరించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌లపై స్పీకర్ గురువారం (18న) తీర్పు వెల్లడించనున్నా రు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమకు సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలని స్పీకర్‌ను ఇప్పటికే కోరారు.
పూర్వాపరాలు..
తమ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు పది మంది వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరినందున రాజ్యాంగంలోని (పదవ షెడ్యూలు ప్రకారం) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. అయినా స్పీకర్ పట్టించుకోకపోవడంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పీకర్ నిర్ణయానికే వదిలి వేసింది. దీంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్‌తో ము గిసింది. కాగా అసెంబ్లీ సమావేశాలు, కా మన్‌వెల్త్ సమావేశాలకు వెళ్ళాల్సి వచ్చినందున అనర్హత పిటిషన్లపై విచారణకు సమయం సరిపోలేదు కాబట్టి మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తోసి పుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలేవీ చూపించలేదని స్పీకర్ తెలిపారు.
ఐదుగురికి భారీ ఊరట..
ఇదిలాఉండగా స్పీకర్ తీర్పుతో అనర్హత పిటిషన్లను ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీకి భారీ ఊరట లభించింది. ఈ నెల 19వ తేదీలోగా స్పీకర్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి గడువు ముగియనున్నది. ముగ్గురు ఎమ్మెల్యేలు యా ద య్య, పోచారం సంజయ్‌లపై స్పీకర్ గురువారం తీర్పు ఇవ్వనున్నారు.
ఆ ఇద్దరి అంశంపై సస్పెన్స్
ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వారిరువురిపై అనర్హత వేటు పడుతుందని కొందరు, కాదు వేటు వేయడానికి ముందే వారు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారని మరి కొందరు అంటున్నారు. దానం నాగేందర్ బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.