ఆసిఫాబాద్: ఆర్‌టిసి బస్సు పత్తి చేనులోకి దూసుకెళ్లిన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలిలో జరిగింది. ఆర్‌టిసి బస్సు పరందోలి గ్రామ శివారులో అదుపుతప్పి పత్తిచేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆర్‌టిసి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో పోలీసులు బస్సును పక్కకు తొలగించారు.