స్నేహితుని పుట్టిన రోజు వేడుకలుకు హాజరు కావడానికి వెళ్తు యువకుడు మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు వివరాలలోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం శరత్ రెడ్డి (20) అనే యువకుడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు,గ్రామస్థుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన శరత్ రెడ్డి సోమవారం తన మిత్రునితో కలిసి తన బైక్ పై రేపాక నుండి కరీంనగర్ లో తన స్నేహితుని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అల్గునూర్ లో స్కూటీ ఎదురు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో శరత్ రెడ్డి కిందపడడంతో తలకు బలమైన గాయమై రక్త స్రావం జరిగింది.
వెంటనే గాయపడ్డ శరత్ కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శరత్ రెడ్డి మృతి చెందాడు. గుర్రం లావణ్య – శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరూ కొడుకులు కాగా పెద్ద కొడుకు చందురెడ్డి, చిన్న కొడుకు శరత్ రెడ్డి. మృతి చెందిన చిన్న కొడుకు కరీంనగర్ లోని స్థానిక డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. యువకుని మృతితో రేపాక గ్రామంలో తీవ్ర విశాదం నెలకొంది. ఈ సంఘనచ పై ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్ ల కేసు నమోదైంది.