పంచాయతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ యువకుడు సౌదీ అరేబియా నుంచి వచ్చిన తన ఓటు వినియోగించుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామానికి చెందిన బొమ్మ కంటి సంపత్ గౌడ్ ఉపాధి తెరువు కోసం గల్ఫ్ కు వెళ్ళాడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకొన్న అతను ఉపాధి కోసం సౌదీ అరేబియాలో ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా స్వదేశానికి వచ్చాడు సంపత్ గౌడ్.
ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణమని, ఒక్క ఓటుతోనే గ్రామ భవిష్యత్తు మారుతుందని సంతప్ గౌడ్ అన్నాడు. వ్యక్తిగత పనులు, ఖర్చులు పక్కనపెట్టి, దేశ పట్ల బాధ్యతగా ఓటు వేయడం గౌరవంగా భావించిన అతను… యువతకు ఆదర్శంగా నిలుస్తూ, ఓటు విలువను గుర్తు చేసే గొప్ప ఉదాహరణగా నిలిచాడని పలువురు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.