వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా శాటిలైట్ ప్రాతిపదిక టోల్ టాక్స్ వసూళ్లు విధానం అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని రాజ్యసభలో బుదవారం కేంద్ర జాతీయ రహదారులు, రవాణా , పోర్టుల మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. శాటిలైట్ ద్వారా వినూత్న అధునాతన సాంకేతికత వినియోగం వల్ల టోల్‌ప్లాజాల వద్ద పన్నుల వసూళ్లు జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు తుదిరూపంలో ఉంది. శాటిలైట్ల ద్వారా పనిచేసే ఈ విధానంలో ఎఐ వాడకం కూడా ఉంటుంది. దీని వల్ల టోల్ టాక్స్‌ల వసూళ్లు వేగవంతం అవుతాయని వివరించారు. ఇంధనం వనరులు రూ 6000 కోట్ల మేర ఆదా అవుతుంది. ప్రభుత్వ రాబటి పెరుగుతుంది. పైగా టోల్ ప్లాజా వద్ద క్షణకాలంలో వసూళ్లు జరిగిపోతాయని వివరించారు. 2026 చివరి నాటికి ఈ విధానం అమలులోకి వస్తుందని చెప్పారు.