తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఇంకా భారీగా ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. అయితే, ఒంటి గంటలోపు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అవకాశమిచ్చారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. కాగా, పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.