జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, తీగారం గ్రామ మాజీ సర్పంచ్‌పై బిఆర్‌ఎస్ నాయకులు విచక్షణా రహితంగా దాడిచేశారు. బాధితుల కథనం ప్రకారం..వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు బేతు కుమారస్వామి గెలుపొందారు. ఈ గెలుపును జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్ శ్రేణులు, తీగారం ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కటారి పాపారావు, వేణు రావు మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్‌తోపాటు కాంగ్రెస్ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనలో పోగు శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో స్పృహ తప్పి పోయాడు. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎన్నికల్లో ఓడిపోయారనే అక్కసుతో దాడి చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.