మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ప ల్లె ప్రజలు పట్టం కట్టారని ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కు మార్‌గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడో విడతలోనూ ప్రజలు తమ పార్టీ కి పట్టం కట్టారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం గ్రామీణ ప్ర జలు తమ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చే సిన విశ్వాసానికి స్పష్టమైన ప్రతిబింబం అని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్ప ష్టమైన మార్పునకు ఇది సంకేతమని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలను తమ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకున్నదని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచా ర వ్యూహాలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక నాయకులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకూ విస్తరించిన ప్రచా రం పార్టీకి అనుకూలంగా మారిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరు, ఈ తరువాయి 9లో