న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లోని మూడు పాఠశాలలకు బుధవారం బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. ఈ బెదిరింపులపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ శరద్ సింఘాల్ మాట్లాడుతూ.. బాధిత పాఠశాలలకు వెంటనే పోలీసు బృందాలను మోహరించామని, భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేశామని చెప్పారు. ప్రస్తుతం భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.
సోమవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని 11 ప్రైవేట్ పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. తాజాగా అహ్మదాబాద్ లో కూడా బెదిరింపులు రావడంతో.. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాల భవనాలను వెంటనే ఖాళీ చేయించారు. మొదట మూడు పాఠశాలలకు ఇటువంటి ఈమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వా మరో ఏడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీటిపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.