హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’. హారర్, రొమాంటిక్, కామెడీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, తొలి సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా’ అంటూ సాగే మెలోడీ ప్రోమోని విడుదల చేశారు. తాజాగా ఆ పాట పూర్తి వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. కృష్షకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. తమన్ సంగీతం అందించారు. ఇక పాటలో నిధి అగర్వాల్, ప్రభాస్‌ల జోడీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా.. మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది.