హైదరాబాద్: కింగ్ నాగార్జునకు ఎంత వయస్సు పెరిగిన గ్లామర్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకే ఆయన్ని టాలీవుడ్ మన్మధుడు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు నాగార్జున తాత కాబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్‌మీడియాని కుదిపేస్తోంది. తొలుత నాగచైతన్య, శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, శోభిత టీం ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా అఖిల్-జైనబ్ పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందుతున్నారని వార్త వైరల్ అవుతోంది. అఖిల్ కానీ, జైనబ్ కానీ, దీని గురించి మాట్లాడులేదు.
అయితే దీనిపై తాజాగా నాగార్జున స్పందించారు. ఓ హెల్త్ ఈవెంట్‌కి హాజరైన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చిరునవ్వుతో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని సమాధానం ఇచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.