హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘కెడి’ సినిమాకు దర్శకత్వం వహించిన కిరణ్ కుమార్(కెకె) బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కెజెక్యూ: కింగ్ జాకీ క్వీన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్ర యూనిట్, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కిరణ్ దర్శకత్వం వహించిన ‘కెడి’ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కిరణ్ పని చేశారు. ఆయన్న అందరూ ఆప్యాయంగా కెకె అని పిలుచుకుంటారు. కెకె దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.