కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం జర్మనీలోని బిఎండబ్ల్యూ ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ సందర్భంగా భారతదేశంలో తయారీ రంగం పై మాట్లాడారు. ఉత్పత్తిన పెంచాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. జర్మనీలో ఐదు రోజుల పర్యటనలో రాహుల్ ఉన్నారు. బెర్లిన్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు , భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతున్నారు. బిఎండబ్ల్యూ ఫ్యాక్టరీ సందర్శించడం ఓ అద్భుతమైన అనుభవం అని ఫ్యాక్టరీ పర్యటన తర్వాత రాహుల్ అన్నారు. ఆ సంస్థ సహకారంతో తయారైన టివిఎస్ 450 సిసి బైక్ తో పాటు లేటెస్ట్ మోటర్ కార్లు, బైక్ లను రాహుల్ సందర్శించారు. సిబ్బందితో మాట్లాడారు. టివిఎస్ 450 సిసి బైక్ చూసి తాను ఎంతో చాలా సంతోషించానని, భారతీయ ఇంజనీర్ల ప్రతిభా పాటవాలు గొప్పవని, అక్కడ భారతీయ జెండా రెపరెపలు చూసి గర్విస్తున్నానన్నారు. ఆర్థిక వ్యవస్థ లో తయారీ రంగం ప్రాముఖ్యం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో తయారీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు.