అమరావతి: ఎపి సిఎం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణం అని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిక్ బ్యాగుల రూపంలో కమీషన్లు దండుకుంటున్నారని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు విధానాలను కోటిమందికి పైగా తిరస్కరించారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షను రేపు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.