హైదరాబాద్: చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలోదారుణం చోటు చేసుకుంది. మంగళవారం స్కూల్ నుంచి రాగానే బాత్రూంకు వెళ్లాడు. ముఖం కడుక్కుంటుండగా ఐడీకార్డు ట్యాగ్ కిటికీలో ఇరుక్కుపోవడంతో 9 ఏళ్ల విద్యార్థి ప్రశాంత్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రమాదవశాత్తే.. ప్రశాంత్ చనిపోయాడని పోలీసులు గుర్తించారు.