హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల మూడో ఫేస్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటవరకూ 80.8 శాతం ఓటింగ్ నమోదైంది. 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి అధికార కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. మూడు విడతలు కలిపి 12,727 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 4,930 ఆధిక్యంలో ఉండగా.. 2,453 మంది బిఆర్ఎస్, 479 మంది బిజెపి, 1,249 మంది ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. గత రెండు విడుదల్లో 60 శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. ఇప్పుడు మూడో విడదలోనూ హస్తం పార్టీదే హవా కొనసాగుతోంది.