ఢిల్లీ లో వాయుకాలుష్య సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఎన్ హెచ్ఎఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోకి ప్రవేశించే 9 టోల్ ప్లాజాలను మూసి వేయాలని ఎన్ హెచ్ఎఐ కు సుప్రీం కోర్టు సూచించింది. కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దామని చెప్పింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారు. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇతర పనులు చూపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఢిల్లీలో మొత్తం 2.50 లక్షల మంది కార్మికులు ఉన్నారని, 7 వేల మంది కార్మికుల ఖాతాలే వెరిఫై అయినట్లు తెలిపింది. పాఠశాల మూసివేత విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఢిల్లిలో కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీం కోర్టు తెలిపింది.