మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజ లు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయింద ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పద ని కేటీఆర్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చె ప్పారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన వి డుదల చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొ ట్లాడేది భారత రాష్ట్ర సమితిని అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను భారత రాష్ట్ర సమితి నేతలకు కట్టపెట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అ ధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాల ను తట్టుకొని వీరోచితంగా పోరాడి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వెం ట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓ టర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే పోరాటం
ఇది సామాన్య విజయం కాదని, చరిత్రలో నిలిచిపోయే పోరా టం అని కెటిఆర్ అన్నారు. యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వర కు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరు షం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అరాచక కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఫలితాలతో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడిందన్నారు. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్
ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అని కెటిఆర్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి రెండేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం, రైతు బంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలే ప్రజల ఆగ్రహానికి కారణమన్నారు. రేవంత్ పాపం పండింది కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో ఈ తిరుగుబాటు వచ్చిందన్నారు. మా ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ హింసను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే తమ పార్టీ కార్యకర్తల పైన దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరి కి భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.