అబుదాబీ: బుధవారం జరిగిన ఐపిఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ని రూ.13 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోరును అతడు ఇంటర్‌నేషనల్ లీగ్ టి-20లో సత్తా చాటాడు. ఈ లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టుకు ప్రతినిధ్యం వహిస్తున్న లైమ్, డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లో లైమ్ 76, షరఫు 39, హేల్స్ 25 పరుగులు చేశారు. ఇక లక్ష్య చేధనలో డెజర్ట్ వైపర్స్ జట్టుకు అద్భుత ఆరంభం లభించింది. హోల్డర్, జమాన్‌లు తొలి వికెట్‌కి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హోల్డర్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ, ఆ తర్వాత స్వల్ప తేడాలతో వికెట్లు కోల్పోతూ వచ్చారు. చివరి ఓవర్‌లో 13 పరుగులు కాల్సి ఉండగా. అజయ్ కుమార్ ఆ స్కోర్‌ని డిఫెండ్ చేశాడు. దీంతో డెజర్ట్ వైపర్స్ జట్టు 20 ఓవర్లలో6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయడంతో అబుదాబీ నైట్‌రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన లైమ్ లివింగ్‌స్టోన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.