హైదరాబాద్: ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టి వేయడంపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలకు భయపడే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోు పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని… పార్టీ మారిన వారిని ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని పేర్కొన్నారు.