భారత ఉప రాష్ట్రపతి సిపి రాధ కృష్ణన్ ఈనెల 20 ,21 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. డిసెంబర్ 20 వ తేదీన ఉపరాష్ట్రపతి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్తారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి లోక్ భవన్ లో రాత్రి బస చేస్తారు. 21 వ తేది ఉదయం కన్హా శాంతి వనంలో ఏర్పాటుచేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని న్యూఢిల్లీ తిరిగి వెళ్తారు. కాగా ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సంబంధిత ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బందోబస్తు ఏర్పాట్లు, ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో రహదారుల నిర్వహణ, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. ఉప రాష్ట్ర పతి పర్యటనకు ఏ విధమైన లోటు జరగాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.