వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్య తీవ్రత పెరుగడంలో ఊపిరి తీసుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. రోజురోజుకు భాగ్యనగరంలో గాలి నాణ్యత సూచీ క్షీణిస్తోంది. ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తుండగా గాలి కాలుష్యం హైదరాబాద్‌ను కూడా కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత తగ్గిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 110 రోజులు గాలి నాణ్యత పూర్ కేటిగిరీలో ఉంది. నిర్మాణ పనులు, వాహనాల రద్దీ, పరిశ్రమల ఉద్గారాలు వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి కరువవుతున్న నేపథ్యంలో ఢిల్లీ వంటి పరిస్థితి రాకుముందే కాలుష్య కట్టడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. శీతాకాలంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. హైదరాబాద్‌లో కూడా వాయు నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగానే మారుతోందని నివేదికలు చెబుతున్నాయి.