దేశీయ స్టాక్‌మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు పడిపోయి 84,680 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 167 పాయింట్లు తగ్గి 25,860కి చేరింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో షేర్లు 5 శాతం వరకు పడిపోయాయి. టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు సుమారు 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీలో 50 షేర్లలో 39 నష్టపోయాయి. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. గ్లోబల్ మార్కెట్లలో కూడా ఆసియా, అమెరికా సూచీలు తగ్గాయి. డిసెంబర్ 15న ఎఫ్‌ఐఐలు రూ.1,468 కోట్ల షేర్లు విక్రయించగా, డిఐఐలు రూ.1,792 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.