మన తెలంగాణ/హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీవ్ర కలకలం రేపిన బాండీ బీచ్ ఉగ్ర దాడికి హైదరాబాద్‌తో సంబంధాలున్నట్లు తేలిం ది. ఈ దాడిలో ప్రధాన నిందితుడైన సాజిద్ అక్ర మ్(50) హైదరాబాద్‌కు చెందినవాడేనని తెలం గాణ డిజిపి కార్యాలయం మంగళవారం ఓ సంచ లన ప్రకటన విడుదల చేసింది. కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబా ద్‌కు చెందిన వాడిగా ప్రకటించారు. హైదరాబా ద్‌లోనే బీకామ్ చేసిన సాజిద్ 1998 నవంబర్‌లో ఆస్రే ్టలియా వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను వివాహం చేసుకు న్నాడు. వీరికి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉ న్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉ న్నారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లినప్పటికీ, సాజిద్ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ఆస్ట్రే లియా వెళ్లిన తర్వాత కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు తెలిపింది. అయితే, హైదరాబాద్‌లో అతనికి ఎలాం టి నేర చరిత్రలేదని స్పష్టం చేసింది. అతని కుటుం బసభ్యులు కూడా సాజిద్‌కు ఉగ్ర వాద సంస్థలతో ఎటువంటి సంబంధాలులేవని చెబుతున్నారు. ఉ ద్యోగం కోసమే ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 27 ఏళ్లలో ఇండియాకి 6 సార్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ ఇండియాకి రాలేదని వెల్లడించారు. ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది అక్రమ్ మరణిం చాడు. హైదరాబాద్‌కు చెందిన అక్రమ్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్పటికీ భారత పౌరసత్వం రద్దు చేసుకోలేదని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. తెలంగాణ డిజిపి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్లుగా సాజిత్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. సాజిత్ అతని కుటుంబంతో చాలా తక్కువ సార్లు మాట్లాడాడు.
హైదరాబాద్‌కు చివరిగా 2022లో రాక
సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబా ద్‌కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించా రు. అదే అతను భారత్‌కు వచ్చిన ఆరోసారి, చివరి ప ర్యటనగా గుర్తించారు. సుమారు 50 ఏళ్ల వయసు న్న అక్రమ్‌కు హైదరాబాద్‌తో కుటుంబ సంబంధా లు ఉన్నప్పటికీ, దాడి అనంతరం అతని బంధువు లు బహిరంగంగా అతనితో తమకు ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. బాండీ బీచ్ ఉగ్రదాడి నిందితుడి చివరి హైదరాబాద్ పర్యటన 2022లో అంటే మూడేళ్ల క్రితం వచ్చినట్లు పోలీసులు వెల్ల డించారు. అక్రమ్ తండ్రి 2009లో మరణించగా, తల్లి, సోదరుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టోలి చౌకీలో నివసిస్తున్నారు. ఆస్తి వ్యవహారాలపై సోద రుడితో విభేదాలు తలెత్తడంతో హైదరాబాద్‌లో స్థిర పడే అవకాశాలు పరిశీలిం చేందుకే ఒకసారి పర్య టనలో ఇక్కడికి వచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని ఒక కళా శాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన అతను మధ్య మధ్యలో భారత్‌కు వస్తుండగా, 2022లో చేసిన పర్యటననే చివరిదిగా తెలంగాణ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దాడి తర్వాత మీడి యాతో మాట్లాడిన అక్రమ్ సోదరుడు కుటుంబా నికి అతనితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇస్లామిక్ స్టేట్ ప్రభావం
ఈ ఉగ్రదాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ఉం దని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బార్రెట్ మంగళవారం వెల్లడించారు. నిందితులు తండ్రీ కొడుకులని, తండ్రి కాల్పుల్లో మృతి చెం దగా, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వారి దగ్గర లభించినసాక్షాల ఆధారంగా వారు ఇస్లామిక్ స్టేట్ ప్రభావితులని పాత్రికేయుల సమావేశంలో వివరించారు.