గ్రామ పంచాయతీలో పారిశుద్థ్య కార్మికురాలిగా పనిచేసిన ఓ మహిళ అదే గ్రాయ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. రేఖంపల్లి గ్రామానికి చెందిన కొలువురు సుజాత భర్త శ్రీను గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తించేవారు. సంవత్సరం క్రితం శ్రీను చనిపోవడంతో సుజాతను పారిశుద్ధ్య కార్మికురాలిగా గ్రామ ప్రజలు నియమించారు. గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ రావడంతో సుజాత కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది.