యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక భక్తుడు బంగారు చీరను సమర్పించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ ఆలయ అధికారులకు అందజేశాడు. ఈ చీర పొడవు 5.30 మీటర్లు, వెడల్పు 48 ఇంచీలు ఉంటుందని తెలిపారు. కాగా స్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. మంగళవారం ఆంజనేయుడికి ఆకుపూజను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.