ఆనాటి భారత సైనికులు ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన రోజు విజయ్ దివస్ అని, ఈరోజు చరిత్రలో గర్వించదగిన, గుర్తుంచుకోదగిన రోజు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లోని అమర జవాన్ల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి అమర జవాన్లను స్మరించుకోవడం గుర్తించుకోదగిన సందర్భమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యుద్ధ సమయంలో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ, సైనిక నాయకులు, అమర జవాన్లు అందరికీ వందనాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు.