బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్): మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మంగళవారం(డిసెంబర్ 16) ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో 34 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఏడుగురు మహిళలతో సహా 34 మంది నక్సల్స్.. పునరావాస కార్యక్రమం కింద సీనియర్ పోలీసు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర యాదవ్ తెలిపారు. సరెండర్ అయిన వారిలో 26 మందిపై మొత్తం రూ.84 లక్షల రివార్డు ఉన్నట్లు ఆయన చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్సీ), తెలంగాణ రాష్ట్ర కమిటీ, మావోయిస్టుల ఆంధ్ర-ఒడిశా సరిహద్దు విభాగంలో చురుకుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.