మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఎ వరి భిక్ష కాదు అని, అది రా జ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అ ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత లు వారి సొంత ఇళ్లు అమ్మి నిధు లు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ఎంఎల్‌ఎలకు అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు. ప్ర జలను, ప్రజాప్రతినిధులను చం పేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఖానాపూర్, షాద్ నగర్ నియోజకవర్గా ల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచు లు, వార్డు సభ్యులను కెటిఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఎవరు..? అని ప్రశ్నించారు. అవి వారి అబ్బ సొత్తు కాదు అని, రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తున్నారా..? అని నిలదీశారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుందని స్పష్టం చేశారు.
హక్కుల కోసం కొట్లాడండి..
కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మోసం చేసి, రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని కెటిఆర్ ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలని, ఆ నిధులను ఆపే హక్కు ఏ ముఖ్యమంత్రికి గానీ, ఎంఎల్‌ఎకు గానీ లేదని అన్నారు. హక్కుల కోసం కొట్లాడండి, బిఆర్‌ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని బిఆర్‌ఎస్ సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. ఇందుకోసం జిల్లాకోక ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటుతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కెసిఆర్ పాలనలో పల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామం వచ్చాయని, తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయని వ్యాఖ్యానించారు. క్యూ లైన్‌లో చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి తెలివిగా యూరియా యాప్ అనే కొత్త స్కీమ్ తెచ్చారని విమర్శించారు. షాపులో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా..? అని ఎద్దేవా చేశారు.
విజయోత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారం
సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కెటిఆర్ విమర్శించారు. ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్, కెసిఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే అని, మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల కోసం గెలిచిన సర్పంచ్‌లు, సగం కాలం బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారని తెలిపారు. ఖానాపూర్, షాద్ నగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగురడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.