సినీ ఇండస్ట్రీలో రూమర్స్ రావడం సహజమే. ముఖ్యంగా హీరోయిన్లపై ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయి. వాటిని కొందరు పట్టించుకోకుండా వదిలేస్తే.. మరికొందరు క్లారిటీ ఇస్తుంటారు. తాజాగా హీరోయిన్ మెహరీన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మెహరీన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి జరిగిందంటూ ఓ మీడియా సంస్థ వార్త ప్రచురించింది. దీనిపై మెహరీన్ క్లారిటీ ఇచ్చింది. ఈ వదంతులపై అసహనం వ్యక్తం చేసిన ఆమ.. గత రెండేళ్లుగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నానని.. కానీ, ఇప్పుడు మాట్లాడక తప్పడం లేదని మెహరీన్ పేర్కొంది. ‘‘ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని వార్త రాశారు. అతడితో నాకు పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచానికి చెబుతా. నన్ను నమ్మండి’’ అని తెలిపింది. తన పెళ్లి గురించి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరింది.